ఎన్ని రకాలు స్కూళ్ళు ఉన్నాయంటే...?
MPP స్కూళ్ళు: అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే లక్ష్యంతో ఏర్పడిన మండల పరిషద్ స్కూళ్ళు ఉన్నాయి. ఇవి ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఉంటాయి.
ZPHS స్కూళ్ళు: జిల్లా పరిషద్ స్కూళ్ళలో 6-10 తరగతులు ఉంటాయి.
GHS: స్కూళ్ళు: పూర్తిగా ప్రభుత్వ స్కూళ్ళు.
తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ : సామాజిక వర్గాల వారిగా స్కూళ్ళను ప్రత్యేకం చేశారు. రకరకాలైన గురుకులాలన్ని కలిపి ఉన్నాయి. కొన్నింటిలో ఇంటర్ విద్య కూడా ఉంది.
తెలంగాణ మోడల్ స్కూళ్ళు: వెనుకబడిన మండలాలలో ఇంగ్లిష్ మీడియం విద్య అందించేందుకు ప్రభుత్వం ఈ స్కూళ్ళు స్థాపించింది. ఇందులో 6-12 తరగతులు ఉంటాయి.
సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు(TSWREI): వీటిని 1984 లోనే స్థాపించారు. పేద పిల్లలకు ముఖ్యంగా షెడ్యూలు కులాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దేశించినవి.
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్(TTWREIS). ఇవి గిరిజన సంక్షేమ హాస్టళ్ళ పాఠశాలలు.
మహాత్మా జ్యోతిభా ఫూలే స్కూళ్ళు((MJPTBCWREI): వెనుకబడిన తరగతుల కుటుంబాల పిల్లల కోసం స్కూళ్ళు ఏర్పాటు చేశారు. ఇందులో అయిదు నుండి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు. జూనియర్ కాలేజిలు డిగ్రీ కాలేజిలు కూడా వీటి అధ్వర్యంలో నడుస్తున్నాయి.
ఏకలవ్య మోడల్ రెసిడేన్షియల్ స్కూళ్ళు(TTWREIS): రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో స్కూళ్ళు మంజూరు చేశారు.
ఆశ్రమ పాటశాలలు: ట్రైబల్ సబ్ ప్లాన్ ప్రాంతాలలో గిరిజన సంక్షేమ శాఖ వీటిని నడిపిస్తుంది.
కస్తుర్బా స్కూళ్ళు(KGBV): కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. భారత ప్రభుత్వం బాలికలకు12 వ తరగతి వరకు రెసిడేన్షియల్ విద్యను అందించేందుకు 2004 లో ప్రారంబించింది. 75శాతం సీట్లు SC,ST,BC,Minority కుటుంబాల పిల్లలకు మిగతా 25 శాతం సెట్లు BPL కుటుంబాల పిల్లలకు కేటాయిస్తారు.
నవోదయ స్కూళ్ళు: భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ అధ్వర్యంలో నడుస్తాయి.1986 లో CBSE సిలబస్ తో 6-12 తరగతులు చదివే తెలివైన గ్రామీణ పిల్లలకు కోసం వీటిని ప్రారంబించారు.
సైనిక్ స్కూళ్ళు: 1961లో రక్షణ శాఖ అధ్వర్యంలో నడుస్తాయి. రక్షణ సేవలో నాయకులను తయారు చేయడానికి విద్యార్థులను సన్నద్దులను చేయడం వీటి ప్రధాన లక్ష్యం.
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు(TMREIS): ఇందులో 75శాతం సీట్లు ముస్లిం మైనారిటిలకుమిగతా 25శాతం BPL కుటుంబాల పిల్లలకు కేటాయిస్తారు. వీటిలో 12 వ తరగతి వరకు కూడా అవకాశం ఉంది.
ఎయిడెడ్ స్కూళ్ళు: ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతూ ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే స్కూళ్ళు.
అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ళు: పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే స్కూళ్ళు. ఇందులో బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళు,కార్పోరేట్ స్కూళ్ళు,చారిటి సంస్థల అధ్వర్యంలో నడిచే స్కూళ్ళు ఉంటాయి.
ఇంటర్నేషనల్ స్కూళ్ళు: ఐ.బి. లాంటి అంతర్జాతీయ కరికులంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నడిచే డే స్కూళ్ళు.
బోర్డింగ్ స్కూళ్ళు: ఐ.బి. లాంటి అంతర్జాతీయ కరికులంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నడిచే రెసిడెన్షియల్ స్కూళ్ళు.
సింగరేణి స్కూళ్ళు:* సింగరేణి కాలరీస్ ఎడుకేషనల్ సొసైటి అధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు. తొమ్మిది స్కూళ్ళు, ఒక డిగ్రీ కాలేజీ, ఒక జూనియర్ కాలేజీ, ఒక పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి.
రైల్వే స్కూళ్ళు: భారత రైల్వే శాఖ 1873 లోనే స్కూళ్ళు ప్రారంబించింది.
ఆర్మీ స్కూళ్ళు: కంటోన్మెంట్ ఏరియాలలో 1974లో ఆర్మీ పబ్లిక్ స్కూళ్ళు స్థాపించారు.ఆర్మీ వెల్ఫేర్ ఎడుకేషన్ సొసైటి పేరుతో రక్షణ శాఖ వీటిని నడిపిస్తుంది. ఇవి CBSE సిలబస్ అనుసరిస్తాయి.
ఎయిర్ ఫోర్స్ స్కూళ్ళు: వీటిని ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ స్కూల్స్ అంటారు. వాయుసేన సిబ్బంది పిల్లల కోసం వీటిని స్థాపించారు.1955 నుండి రక్షణ శాఖ CBSE సిలబస్ తో నడిపిస్తున్నది. యూ.కే.జి. నుండి 12వ తగరగతి వరకు విద్యను అందిస్తారు.
నేవీ స్కూళ్ళు: నేవీ ఎడుకేషన్ సొసైటి నేవీ చిల్ద్రెన్ స్కూల్స్ పేరిట వీటిని 1965 నుండి CBSE సిలబస్ తో నడిపిస్తున్నది.
ఆటమిక్ ఎనర్జీ స్కూళ్ళు: ఆటమిక్ ఎనర్జీ ఎడుకేషన్ సొసైటి అధ్వర్యంలో దేశంలోని 16 ప్రాంతాలలో 30 స్కూళ్ళు నడుస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, మణుగూరులలో ఈ స్కూళ్ళు ఉన్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జిలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల కోసం ఈ స్కూళ్ళు స్థాపించారు.
కేంద్రీయ విద్యాలయాలు: భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ 1963లో వీటిని ప్రారంబించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం దేశవ్యాప్తంగా స్కూళ్ళు ఉన్నాయి. వీటిలో ఒకటి నుండి 12 తరగతి వరకు అవకాశం ఉంది.
క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు: వివిధ రకాలైన క్రైస్తవ మిషనరీల అధ్వర్యంలో దేశంలో స్కూళ్ళు స్థాపించారు.
ఇస్లామిక్ మదర్సాలు: ఇస్లామిక్ సంస్కృతి బోధించడానికి ఉద్దేశించినవి. వ్యాకరణం, గణితం, కవిత్వం, చరిత్ర అన్నింటికీ మించి ఖురాన్ నేర్పిస్తారు.ఎలిమెంటరి స్కూల్ ను మక్తబ్ అని సెకండరి స్కూల్ ను మదర్సా అంటారు.
గురుద్వార స్కూళ్ళు: సిక్కుల ఆచార సంప్రదాయాల పరిరక్షణకు ఖల్సా కొన్ని విద్యా సంస్థలను స్థాపించింది. సిక్కుమత నియమ నిభందనలను పాటించేలా చూస్తాయి.
శిశుమందిర్ స్కూళ్ళు :1952లో నానాజీ దేశ్ముఖ్ మొదటి స్కూలును గోరక్ పూర్ లో స్థాపించారు. హిందూ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ధ్యేయంగా దేశవ్యాప్తంగా సరస్వతి శిశు మందిర్ ల పేరిట స్కూళ్ళను రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్ నడిపిస్తున్నది.
వేద పాటశాలలు: సాంప్రదాయ గురుకుల పద్ధతిలో వేద అధ్యయనం కోసం వీటిని స్థాపించారు. యోగ, ధ్యానం, వేదపటనం, గణితం, సేవ నేర్చుకుంటారు.
ప్రత్యేక బోధనా పద్ధతుల స్కూళ్ళు: మాంటిస్సొరి, జెనాప్లాన్, డాల్టన్ వంటి పద్ధతులు అనుసరిస్తూ బోధించే స్కూళ్ళు.
స్పెషల్ స్కూళ్ళు: వివిధ లోపాలున్న పిల్లలకు విద్యను అందించే స్కూళ్ళు. చెవిటి-మూగ,ఎపిలెప్సి,ఆటిజం, ADHD వంటి ఇబ్బందులు ఉన్న వారికి ప్రత్యేక స్కూళ్ళు ఉన్నాయి.
అంధుల పాటశాలలు: బ్రెయిలీ లిపిలో విద్యను అందించే స్కూళ్ళు.
ఓపెన్ స్కూళ్ళు: ఇంటివద్దనే ఉండి పరీక్షలు రాసుకునే అవకాశం గల స్కూళ్ళు.
35. స్పోర్ట్స్ స్కూళ్ళు: చదువుతో పాటు ఆటలు నేర్పించే స్కూళ్ళు.
అనాథ పాఠశాలలు: ప్రభుత్వం మరియు స్వచ్చంద సంస్థలు కొన్ని అనాథ పాటశాలలు నడిపిస్తున్నాయి.
అంగన్ వాడి స్కూళ్ళు: గ్రామీణ పేద పిల్లల ఆకలి తీర్చి వారికి పౌష్టిక ఆహరం అందించడానికి 1975లో భారత ప్రభుత్వం ICDS కార్యక్రమం చేపట్టింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ వీటిని నిర్వహిస్తుంది.
ప్రి స్కూళ్ళు/ప్లే స్కూళ్ళు: ప్రి-ప్రైమరీ, నర్సరీ,డే కేర్, కిండర్ గార్టెన్ అని వివిధ పేర్లతో వీటిని పిలుస్తున్నారు.
ప్రైమరీ స్కూళ్ళు: ఒకటి నుండి అయిదు తరగతుల వరకు ఉండేవి.
అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు: ఒకటి నుండి ఏడు తరగతుల వరకు ఉండేవి.
హై స్కూళ్ళు/సెకండరి స్కూళ్ళు: పదవ తరగతి వరకు ఉండేవి.
హయ్యర్ సెకండరి/సీనియర్ సెకండరీ స్కూళ్ళు: 12 తరగతి వరకు ఉండేవి.
బాలుర స్కూళ్ళు:
బాలికల స్కూళ్ళు:
కో-ఎడ్యుకేషన్ స్కూళ్ళు:
డే స్కూళ్ళు:
రెసిడెన్షియల్ స్కూళ్ళు:
సెమి-రెసిడెన్షియల్ స్కూళ్ళు:
ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు:
తెలుగు మీడియం స్కూళ్ళు:
ఉర్దూ మీడియం స్కూళ్ళు:
సంస్కృత స్కూళ్ళు:
స్టేట్ సిలబస్ స్కూళ్ళు: Board of Secondary Education (BSE)సిలబస్ అనుసరించేవి.
సెంట్రల్ సిలబస్ స్కూళ్ళు: Central Board of Secondary Education (CBSE), Indian Certificate of Secondary Education (ICSE) సిలబస్ అనుసరించేవి.
ఇంటర్నేషనల్ సిలబస్ స్కూళ్ళు:* International General Certificate of Secondary Education (IGCSE), international Baccalaureate (IB) సిలబస్ అనుసరించేవి