సోమవారం

        తిరుపతిలో న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్ధులు గంజాయికి బానిసయ్యారు. ఏది చేస్తే నేరమో, ఏం చేస్తే జైల్లో పెడతారో, ఏం చేస్తే సమాజంలో పరువు పోతుందో బాగా తెలిసిన ‘లా’ స్టూడెంట్స్‌ సైతం మత్తుకు బానిసలుగా మారారు. ఈమధ్య మెడిసిన్‌ చదువుతున్న వాళ్లు కూడా ‘డ్రగ్స్‌’ రైడ్స్‌లో పట్టుబడ్డారు. ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును సర్వనాశనం చేస్తుందని తెలిసినా.. ఆ ఉచ్చులో పడిపోతున్నారు. ఏం అనాలి వీళ్లనసలు. కొన్ని ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో చదువుతున్న కొందరు విద్యార్ధులు కూడా డ్రగ్స్‌ ఊబిలో చిక్కుకుపోయారు. కేవలం పెద్దపెద్ద స్కూళ్లలోనే అనుకుంటే పొరపాటే. గంజాయి చాక్లెట్లకు గవర్నమెంట్‌ స్కూల్లో చదువుతున్న విద్యార్ధులు కూడా బానిసలైన హిస్టరీ ఉంది. సో, డ్రగ్స్ మహమ్మారి కొందరికే పరిమితం అని చెప్పడానికి లేదు. 


            యువత అయితే.. డ్రగ్స్‌ గుప్పెట్లోంచి బయటపడలేకపోతోంది. డ్రగ్స్‌ ఉన్నా, తీసుకున్నా నేరమే. సరే.. నేరం గురించి పక్కనపెడదాం. యువ వయసులో డ్రగ్స్‌ తీసుకుంటే.. మున్ముందు ఎందుకూ పనికిరాకుండా పోతారు. యువత నిర్వీర్యం అయితే.. దేశానికే ప్రమాదం. అయినా సరే.. డ్రగ్స్‌కు దాసోహం అవుతున్నారు. ఇక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లయితే రోజుకొకరు చొప్పున పట్టుబడుతున్నారనే చెప్పాలి. ఇక్కడ యువత, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లంటే కేవలం మగాళ్లే కాదు ఆడవాళ్లు సైతం డ్రగ్స్‌ మత్తులో చిత్తవుతున్నారు. సినిమా రంగమైతే డ్రగ్స్‌ విషయంలో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటూ వస్తోంది.

Types Of Schools

ఎన్ని రకాలు స్కూళ్ళు ఉన్నాయంటే...? MPP స్కూళ్ళు: అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే లక్ష్యంతో ఏర్పడిన మండల పరిషద్ స్కూళ్ళు ఉన్నాయి. ఇవి ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఉంటాయి. ZPHS స్కూళ్ళు: జిల్లా పరిషద్ స్కూళ్ళలో 6-10 తరగతులు ఉంటాయి. GHS: స్కూళ్ళు: పూర్తిగా ప్రభుత్వ స్కూళ్ళు. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ : సామాజిక వర్గాల వారిగా స్కూళ్ళను ప్రత్యేకం చేశారు. రకరకాలైన గురుకులాలన్ని కలిపి ఉన్నాయి. కొన్నింటిలో ఇంటర్ విద్య కూడా ఉంది. తెలంగాణ మోడల్ స్కూళ్ళు: వెనుకబడిన మండలాలలో ఇంగ్లిష్ మీడియం విద్య అందించేందుకు ప్రభుత్వం ఈ స్కూళ్ళు స్థాపించింది. ఇందులో 6-12 తరగతులు ఉంటాయి. సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు(TSWREI): వీటిని 1984 లోనే స్థాపించారు. పేద పిల్లలకు ముఖ్యంగా షెడ్యూలు కులాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దేశించినవి. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్(TTWREIS). ఇవి గిరిజన సంక్షేమ హాస్టళ్ళ పాఠశాలలు. మహాత్మా జ్యోతిభా ఫూలే స్కూళ్ళు((MJPTBCWREI): వెనుకబడిన తరగతుల కుటుంబాల పిల్లల కోసం స్కూళ్ళు ఏర్పాటు చేశారు. ఇందులో అయిదు నుండి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు. జ...

Traffic Video

         ఈ వీడియోలో ట్రాపిక్ ఎస్.ఐ చాలన్ వేసే విధానం ఎట్లా ఉందో వివరిస్తుంది